Jumped Deposit Scam Telugu, అసలు విషయం ఏంటి ?

Jumped Deposit Scam Telugu, అసలు విషయం ఏంటి ? : కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ కూడా Jumped Deposit Scam మీద అసలు విషయం తెలియకుండా వీడియోస్ పెట్టారు. ఈ విషయం ఎలా వెళ్లిందో చూద్దాం…. కొంతమంది ఈ విధంగా చెప్పుతూ వచ్చారు

“Technology పెరుగుతోంది సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా స్కాములకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా Jumped Deposit Scam పేరుతో ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది దీని ద్వారా చాలామంది ప్రజలు భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఇంతకీ ఈ కొత్త స్కామ్ ఏమిటి?  తెలుసుకుందాం. Jumped Deposit Scam అనేది యూపీఐ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది, బాధితులను ఆకర్షించడానికి నేరుగాళ్లు బ్యాంక్ ఖాతాలో ఐదువేల రూపాయలు లేదా అంతకంటే తక్కువ జమ చేస్తారు. ఖాతాలో డబ్బు జమ అయినట్లు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆ సమయంలో బాధితుడు బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ ఓపెన్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే నేరుగాడికి యాక్సెస్ లభిస్తుంది. దీంతో ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయం అయిపోతుంది. “

“తాజాగా Jumped Deposit Scam వెలుగులోకి వచ్చింది, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు UPI సేవలను వినియోగిస్తున్నారు, అందరు డిజిటల్ పేమెంట్స్ ను యాక్సెప్ట్ చేస్తుండడంతో పేటీఎం ఫోన్ పే గూగుల్ పే లాంటి ఆప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ కూడా యూపీఐ ద్వారానే చేస్తున్నారు దీనిని కేటుగాళ్లు అస్త్రంగా చేసుకుంటున్నారు. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి యూపీఐ ద్వారా కొంత మొత్తంలో డబ్బులు పంపిస్తారు మీకు మెసేజ్ రాగానే డబ్బులు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు యూపీఐ ఆప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలో యూపీఐ ఐడి లకు పేమెంట్స్ లింక్ లను పంపించి సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేస్తున్నారు. అలాంటి లింక్స్ ఓపెన్ చేసి పేమెంట్ చెక్ చేసుకోవడానికి ప్రయత్నించారో మీ ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది.” ఇలాంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది.

Jumped Deposit Scam Telugu, అసలు విషయం ఏంటి ?

అసలు విషయం ఏంటి ?

NPCI దీని మీద “Clarification on the ‘Jumped Deposit’ Scam: Addressing Technical Misconceptions”  టైటిల్ తో సమాచారం ఇచ్చారు.

To address these concerns and ensure clarity, NPCI would like to provide the following key clarifications:

  • Simply opening a UPI or bank application does not automatically approve a transaction. For a transaction to occur, the user must navigate to the payment request and explicitly click on the ‘pay’ option to authorise it with UPI PIN. Without this step, the payment will not get processed.
  • No external party can directly request or withdraw funds from the user’s account. UPI is a device-based payment system, meaning the payment account is securely linked to the user’s registered number and their specific mobile device. Only the user can initiate transactions or withdrawals, ensuring that others cannot access their funds.
  • Entering the PIN is required even for balance enquiry transactions, and it does not automatically authorise any withdrawal or payment requests which is treated as a separate transaction.

మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే scammers మెసేజ్ లు, లింక్ లు పెట్టినంత మాత్రాన బ్యాంకు నుండి డబ్బులు పోవు. ఆ లింక్ ని click చేసి వాళ్లకి కావాల్సిన సమాచారం అందిచడం ద్వారా మాత్రమే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఇంకోటి scammers మెసేజ్ పంపితే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి UPI PIN ఎంటర్ చేసినంత మాత్రాన డబ్బులు పోవు. వాళ్ళు పంపిన మనీ రిక్వెస్ట్ ని మనం approve చేయడం వళ్ళ బ్యాంకు నుండి మనీ పోతుంది అని గమనించండి. Scammers పంపిన పేమెంట్ రిక్వెస్ట్ ని డిక్లైన్ చేయండి సరిపోతుంది. దీనికి కంగారు పడాల్సింది ఏంలేదు. వాళ్ళు పంపిన లింక్ లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు. మన సైడ్ నుండి తప్పు జరిగితే తప్ప స్కేమ్మెర్స్ మీ బ్యాంకు నుండి మనీ దోచే అవకాశం ఉండదు. దీనికి కొంత డిజిటల్ అవేర్నెస్ అవసరం మనం ఎం చేస్తున్నామో అప్రమత్తంగా ఉంటె సరిపోతుంది.

ఈ స్కాం బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ కొత్త రకం స్కాం బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు

  1. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్ లకు స్పందించకూడదు ముఖ్యంగా ఫేక్ పేమెంట్స్ లింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆ links ని ఓపెన్ చేయకూడదు.
  2. Scammers పంపిన పేమెంట్ రిక్వెస్ట్ ని డిక్లైన్ చేయండి సరిపోతుంది. దీనికి కంగారు పడాల్సింది ఏంలేదు.
  3. ఒకవేళ పొరపాటున డబ్బులు పోతే వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి సంఘటన జరిగిన రెండు గంటల్లోపు ఫిర్యాదు చేస్తే అధికారులు మీ అమౌంట్ను freeze చేసే అవకాశాలు ఉంటాయి

It’s crucial to be aware of financial frauds such as phishing scams and identity theft, Consumers are advised to be aware of financial frauds targeting personal banking information. Educating oneself about common financial frauds is essential to avoid falling victim to online scams

More Online Scams web links

Tag : Jumped Deposit Scam Telugu, అసలు విషయం ఏంటి ?