Guidelines for New Ration Cards in Telangana : తెలంగాణలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల పై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది ఈనెల 26 నుంచి అర్హత కలిగిన కుటుంబాలకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత కార్డులను మంజూరు చేయనున్నారు.
తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదం లభించడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వ వేగవంతం చేసింది ఈనెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. దీంతో దీర్ఘకాలంగా అపరిస్కృతంగా ఉన్న వినతుల పరిష్కారం దిశగా సర్కార్ ముందడుగు వేసినట్లయితే దరఖాస్తులను పూర్తిగా పరిశీలించాక కులగనణ సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను ఆయా జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపుతారు.
పాత విధానంలో ఆదయ పరిమితి గ్రామీణ ప్రాంతాలలో లక్షన్నర పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల ఆదాయం ఉండాలి. సంక్రాంతి తర్వాత నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతుంది. మూడు నెలల క్రితం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాల పరిమితమైన అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందించారు.
ఇక మండల స్థాయిలో ఎంపీడీవో యు ఎల్ బి లో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ వార్డులో ప్రదర్శించే చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదం లభించనుంది. ఆహార భద్రత కార్డులలో సభ్యుల చేర్పులు మార్పులు జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈనెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనుంది.
రాష్ట్రంలో ఇప్పటికే 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో మొత్తం 2.81 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉండగా ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తులలో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 24 లక్షలు గా ఉంది రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో నిర్వహించిన ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు దాదాపు పది లక్షలకు పైగా వచ్చాయి ఇంకా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Tag : Guidelines for New Ration Cards in Telangana